E.G: ఈనెల 18 నుంచి 24 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై 1016 కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ సోమవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కేసుల్లో రూ. 10,16,000 ఈ చలానాలు విధించినట్లు తెలిపారు. వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు.