NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్ కాలనీ 21వ వార్డులో సోమవారం మున్సిపల్ అధికారులు వందరోజుల ప్రణాళికలో భాగంగా మొక్కలను పంపిణీ చేశారు. మున్సిపల్ అధికారులు మాట్లాడుతూ.. వందరోజుల ప్రణాళికలో భాగంగా పట్టణంలో పచ్చదనాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.