WNP: వనపర్తి ఆర్టీసీ డిపో మేనేజర్‌గా దేవేందర్ గౌడ్ నియమితులయ్యారు. ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు డిపో మేనేజర్‌గా పనిచేసిన వేణుగోపాల్ కుషాయిగూడ డిపోకు బదిలీ అయ్యారు. నూతన డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ మాట్లాడుతూ.. డిపో ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సిబ్బంది ఆయనను శాలువాతో సత్కరించి, పూల బొకే అందించారు.