MDK: రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో ఆదివారం ఐకెపి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యంకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని, అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలని సూచించారు. దళారులకు ధాన్యం విక్రయించి నష్టపోద్దని సూచించారు.