HYD: రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ తమ విద్యాలయాల్లోని విద్యార్థినులకు 10వ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు గురువారం నుంచి మూడు రోజులు పాటు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ లత తెలిపారు. ఇందుకోసం షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం కమ్మదనం గ్రామంలోని విద్యాలయంలో ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో అన్ని పాఠశాలల నుండి పాల్గొంటారన్నారు.