MLC Kavita: ఎమ్మెల్సీ కవితా బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసిన ఈడీ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ షాక్ ఇచ్చింది. తాను పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసింది. వాదనలు వినిపించడానికి సిద్దంగా ఉన్నట్లు కోర్టుకు తెలిపింది.
MLC Kavita: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టు అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ షాక్ ఇచ్చింది. బెయిల్ కావాలంటూ కవత తరఫు న్యాయవాదులు ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే కోర్టు కౌంటర్ దాఖలు చేయమని ఈడీని కోరింది. ఈ నేపథ్యంలో కవిత బెయిల్ పిటిషన్పై విచారణం జరిగింది. ఈ మేరకు మే 27 న కౌంటర్ దాఖలు చేస్తామని సీబీఐ పేర్కొంది. జూన్ 7 న ఛార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు సీబీఐ కోర్టుకు వెల్లడించింది. మరో వైపు ఈడీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో తాము వాదనలు వినిపించేందుకు రెడీగా ఉన్నట్లు ఈడీ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీంతో కవిత కేసులో ఎలాంటి ఫలితం వస్తుందో అని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనతో ఉన్నారు.
గతవారంత కవితతో ములాకత్కు కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్ తదితరులు కవితను కలిశారు. అనంతరం ఇది తప్పుడు కేసు అని కవిత కచ్చితంగా నిర్దోశిగా బయటకు వస్తుందని మీడియాకు వారు చెప్పారు.