SRPT: కోదాడ నియోజకవర్గ పరిధిలో MLA పద్మావతి విస్తృతంగా పర్యటిస్తున్నారు. అందులో భాగంగా మోతె మండలం, నామవరం గ్రామంలో ఉన్న ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్‌ను MLA పరిశీలించారు. ప్లాంట్‌కు అవసరమైన నిధులు కేటాయించి, త్వరితగతిన పూర్తిగా ఉపయోగంలోకి తీసుకువస్తామని గ్రామస్థులకు హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.