2007లో ఇదే రోజున HYDలోని లుంబినీ పార్క్, గోకుల్ చాట్ వద్ద జరిగిన వరుస బాంబు పేలుళ్లకు నేటికి 18 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ దాడుల్లో 42 మంది ప్రాణాలు కోల్పోగా, 64 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడుల వెనుక పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థల హస్తం ఉన్నట్లు విచారణలో తేలింది. ఈ ఘటన తర్వాత నగర భద్రతా వ్యవస్థ, నిఘాను అధికారులు మరింత పటిష్టం చేశారు.