NLG: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. తహశీల్దార్లతో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఇంటింటి సర్వే ద్వారా వివరాలను ఖచ్చితంగా నమోదు చేసి, డూప్లికేట్ ఎంట్రీలు లేకుండా చూడాలన్నారు. పెండింగ్లో ఉన్న ఫామ్-8 దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూచించారు.