NZB: మెండోరా మండలం పోచంపాడ్‌లోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీటిమట్టం గురువారం 1,068.50 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టులో 20.902 టీఎంసీల నీరు నిలువ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. యావరేజ్ ఇన్ ఫ్లో 608 క్యూసెక్కులు కాగా KMCకి 100, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నీటి ఆవిరి రూపంలో 277 క్యూసెక్కుల నీరు తగ్గుతోంది.