నల్గొండ జిల్లాలో గడిచిన ఏడాది నేరాలు పెరగ్గా, రోడ్డు ప్రమాదాలు తగ్గాయని ఎస్పీ శరత్ చంద్ర పవార్ చెప్పారు. మహిళలపైన లైంగిక దాడులు, హత్యలు ఎక్కువగానే జరిగాయన్నారు. దోపిడీలు, దొంగతనాలు కూడా గతేడాదితో పోల్చితే పెరిగాయని తెలిపారు. 2024లో జిల్లాలో 33 హత్యలు,100 లైంగిక దాడులు, 657 చీటింగ్ కేసులు నమోదయ్యాయి. నల్గొండను నేర రహిత జిల్లాగా మార్చేలా చూస్తామన్నారు.