SRCL: ఉరేసుకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్‌లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ లోని ఓ రైస్ మిల్ వెనక గుర్తుతెలియని వ్యక్తి ఉరేసుకొని మృతి చెందాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.