ADB: రాష్ట్రంలో వైద్యం, విద్యకు సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు అర్ఫాత్ అహ్మద్ ఖాన్ పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లోని సంజయ్ నగర్‌కు చెందిన లక్ష్మికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కును సోమవారం ఆయన అందజేశారు. పేద ప్రజలకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన కొనసాగిస్తుందని పేర్కొన్నారు.