WNP: ఆత్మకూరు నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన జయన్న సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రావుల గిరిధర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిజాయతీ, మర్యాదతో సేవ చేస్తే ప్రజల గుండెల్లో మంచి స్థానం దొరుకుతుందన్నారు. ప్రజల నమ్మకాన్ని గెలుచుకునే విధంగా పనిచేయాలని ఎస్సైకు సూచించారు.