ADB: ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు గొప్పవని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. నేరడిగొండ మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన దండారి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. గ్రామానికి వచ్చి ఆయనకు ఆదివాసీలు గుస్సాడీ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. ఆనవాయితిగా వస్తున్న సంస్కృతి, సాంప్రదాయాలను నేటి యువతరానికి తెలియజేయాలని కోరారు.