DK Aruna: డీకే అరుణ బిడ్డను మోసం చేసిన డ్రైవర్..పోలీసులకు ఫిర్యాదు!
ప్రముఖ నేత డీకే అరుణ కుమార్తె శ్రుతి రెడ్డి డ్రైవర్ ఆమె క్రెడిట్ కార్డు చోరీ చేశాడు. అంతటితో ఆగలేదు. ఆ నగల దుకాణం వెళ్లి 11 లక్షల రూపాయలు కాజేశాడు కూడా. తర్వాత విషయం తెలుసుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మాజీ మంత్రి డీకే అరుణ(DK Aruna) కుమార్తె శ్రుతి రెడ్డి(Shruti Reddy) క్రైడిట్ కార్డు చోరీకి గురైంది. అయితే ఆమె క్రెడిట్ కార్డును తన దగ్గర పనిచేసే డ్రైవర్ తెలియకుండా తీసుకుని 11 లక్షల రూపాయలు వాడుకున్నాడు. శ్రుతి రెడ్డి బంజారాహిల్స్ రోడ్ నెం 14లో పర్వత్ విల్లాస్ లో ఉంటున్నారు. తన దగ్గర పనిచేసే కారు డ్రైవర్ బీసన్న హెచ్ డీఎఫ్ సీ కార్డును దొంగలించాడు. శ్రుతికి తెలిసిన మహవీర్ జెమ్స్ అండ్ పెరల్స్ నగల దుఖానికి వెళ్లి మేడం తీసుకురమ్మన్నదని చెప్పి 11 లక్షల రూపాయాలను డ్రా చేసీ వాడుకున్నాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న శ్రుతి డ్రైవర్ ను నిలదీసింది. దానికి డ్రైవర్ పొంతలేని సమాధానాలు చెప్పాడు. డబ్బులు దొంగలించి వాడుకోవడమే కాకుండా రకరకాల కథలతో తనను నమ్మించాలని చూశాడు. శ్రుతి రెడ్డి గట్టిగా నిలదీయడంతో అసలు నిజం బయటపడింది. నిందితుడిపై తగిన చర్యలు తీసుకోవల్సిందిగా శ్రుతిరెడ్డి బంజారహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్ చిన్నా అలియాస్ బీసన్నను విచారించి అతడిపై 420, 408 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.