PDPL: ఓదెల మండలం పొత్కపల్లి జడ్పీహెచ్ఎస్లో మధ్యాహ్న భోజనం సరిపడ వండటం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న పాఠశాలలో సుమారు 50 మంది ఉండగా కేవలం 20 మందికి వంట చేశారని మిగతా 30 మందికి అన్నం లేక ప్లేట్లు పట్టుకొని నిలబడ్డామని వాపోయారు. ఈ విషయమై హెచ్ఎం వంట మనుషులను అడగగా అందరికీ పెట్టామని బదులిచ్చినట్లు తెలుస్తోంది.