NGKL: జిల్లాలోని ఆయా పాఠశాలలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు గడువులోగా ఫీజు చెల్లించాలని నాగర్ కర్నూల్ జిల్లా విద్యాధికారి గోవిందరాజులు తెలిపారు. విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 18 వరకు ఫీజు చెల్లించేందుకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని విద్యాధికారి పేర్కొన్నారు.