SRPT: హుజూర్నగర్ మండలంలోని స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లను ఖరారు చేశారు. 7 ఎంపీటీసీ, 11 సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు కేటాయించారు. ఎంపీటీసీ స్థానాల్లో రెండు బీసీ, ఒకటి ఎస్సీ, రెండు జనరల్, రెండు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. సర్పంచ్ స్థానాల్లో మూడు బీసీ, నాలుగు ఎస్సీ, నాలుగు మహిళలకు కేటాయించారు. ఈ రిజర్వేషన్ల ప్రకటనతో గ్రామాల్లో ఎన్నికల హడావుడి మొదలైంది.