NRPT: మక్తల్ మండలం గుర్లపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు బుదరమయంగా మారింది. వాహనాల సంగతి పక్కన పెడితే కనీసం నడవడానికి వీలు లేనంత అధ్వాన పరిస్థితిలో ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొరం వేసి తాత్కాలికంగానైనా మరమ్మతులు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.