WNP: అమరచింత మండలం సింగంపేట గ్రామంలో జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే ఆరోగ్య ఇన్వెస్టిగేటర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఆశా వర్కర్స్కు తగిన సూచనలు చేశారు. గ్రామంలో ముందుగా ఎంపిక చేసిన 20 కుటుంబ సభ్యుల రక్త పరీక్షలు నిర్వహిస్తామని సూపర్వైజర్ మహేశ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మేల్ ఇన్వెస్టిగేటర్ శ్రీకాంత్, నిశాంత్, పాల్గొన్నారు.