JGL: కథలాపూర్(M) కలిగోట సూరమ ప్రాజెక్టు కాల్వ భూనిర్వాసితులకు ఎకరానికి రూ. 50 లక్షలు పరిహారం ఇవ్వాలని BJP కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోడిపల్లి గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ కథలాపూర్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు ఇన్నేళ్లుగా నమ్ముకున్న భూమిని కోల్పోవడంతో ఆవేదనలో ఉన్నారని అన్నారు. పరిహారం రూ.50 లక్షలు పెంచి ఇస్తేనే వారికి న్యాయం జరుగుతుందన్నారు.