SKLM: ఈ నెల 21 నుంచి జిల్లాలో జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. (0-5) ఏళ్లలోపు 1,55,876 మంది పిల్లలు ఉన్నారని, ఆయా కేంద్రాల్లో పోలియో చుక్కలు వేయనున్నట్లు DMHO డాక్టర్ కే అనిత మంగళవారం తెలిపారు. అందుబాటులో లేని వారికి 22 – 25 తేదీల్లో ఇంటింటికి వెళ్లి వేస్తారన్నారు. జిల్లాలో మొత్తం 1252 పోలియో కేంద్రాలు ఉన్నాయన్నారు.