ADB: బోథ్ మండలం నుంచి సోనాల గ్రామానికి వెళుతున్న సమయంలో ఒక వృద్ధురాలు వాహనం నుంచి ప్రమాదవశాత్తు కిందపడి గాయాలపాలైంది. ఈ మేరకు స్పందించిన పోలీసు అధికారులు వృద్ధురాలకి ప్రథమ చికిత్స అందజేసి, స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పోలీస్ ఎస్కార్ట్ వాహనంలో తరలించారు. సమాజ సేవలో పోలీసులు ముందుకు రావడం పట్ల ప్రజలు వారిని అభినందించారు.