JGL : మల్యాల మండల కేంద్రానికి చెందిన రైతు బక్కన్న, మరో రైతు శంకర్ల పొలాల్లో మోటార్ పంపుసెట్లు చోరీకి గురయ్యాయి. గుర్తుతెలియని వ్యక్తులు తమ బావుల నుంచి పంపుసెట్లను దొంగిలించారని రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.