HYD: నగర మెట్రో స్టేషన్ల దగ్గర వాహనాలు పార్కు చేసి, ఎవరు చూడని సమయంలో పార్కింగ్ ఫీజు కట్టకుండా బైకులు తీసుకెళ్లినవారు తప్పించుకోలేరని నిర్వాహకులు తెలిపారు. మీరు పార్కు చేసినప్పుడే డిజిటల్ రూపంలో అన్ని వివరాలు పొందుపరుస్తారు. పార్కింగ్ ఫీజు ఆన్లైన్లో జనరేట్ అవుతుంది. మరోసారి వచ్చినపుడు కనుక చెల్లిస్తే గత పెండింగ్ పార్కింగ్ ఫీజుతో కలిపి కట్టాల్సిందే అన్నారు.