HYD: నగరం నేడు ‘జై శ్రీరామ్’ నినాదంతో హోరెత్తనుంది. ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా నగరంలోని సీతారాంబాగ్ టెంపుల్, ఆకాశూరి హనుమాన్ టెంపుల్ నుంచి భారీ శోభయాత్రలకు సర్వం సిద్ధమైంది. హనుమాన్ టేక్తి వద్ద ఈ యాత్ర ముగుస్తుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు.