రంగారెడ్డి: శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని తొండుపల్లి ఔటర్ ఎగ్జిట్ టోల్ ప్లాజా వద్ద కొందరు వ్యక్తులు సర్వీస్ రోడ్డును కబ్జా చేసి భవనాలు నిర్మిస్తున్నారు. పట్టాభూములను కొనుగోలు చేసి, వాటికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ సర్వీస్ రోడ్డును కూడా తమ భూమిలో కలిపేసుకున్నారు. లోపలికి వెళ్లడానికి, బయటకు రావడానికి మెట్లు కూడా నిర్మించారు.