ADB: భీంపూర్ మండలంలోని ప్రధాన రోడ్డు మార్గం నుంచి నిపాని గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గం ఇటీవల కురిసిన భారీ వర్షానికి కోతకు గురైంది. దీంతో ఈ రోడ్డు మార్గం గుండా భారీ వాహనాలు వెళ్లడానికి ఇబ్బందిగా ఉందని గ్రామస్తులు పేర్కొన్నారు. భారీ వర్షాలు మరోసారి కురిస్తే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉందని వాపోయారు. రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరారు.