NLG: మిర్యాలగూడ మండలం, ఆలగడప గ్రామంలోని కాంగ్రెస్, బీఆర్ఎస్కు చెందిన 100 మంది సోమవారం సీపీఎంలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల పక్షాన నిరంతరం పోరాడే సీపీఎంలో చేరాలన్నారు. సర్పంచులుగా సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు.