GDL: గద్వాల పట్టణం రాజ వీధిలో వెలిసిన వాసవి కన్యకా పరమేశ్వరి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. అమ్మవారికి ప్రీతిపాత్రమైన రోజు శుక్రవారం రాత్రి కరెన్సీతో అలంకరించారు. అలంకరణలో రూ.5,055,000 కరెన్సీ నోట్లు వినియోగించినట్లు ఆర్య వైశ్య సంఘం సభ్యులు తెలిపారు. ఆర్యవైశ్యులు అమ్మవారికి విశేష పూజలు చేశారు.