MBNR: దసరా పండుగ నేపథ్యంలో తిరుగు ప్రయాణం (రిటర్న్ జర్నీ) ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని సోమవారం ఉదయం నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు మహబూబ్నగర్ ఆర్టీసీ డిపో మేనేజర్ బీ. సుజాత తెలిపారు. డిపో నుంచి ఆయా ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.