»Cm Revanth Reddy Asks Officials Provide Better Treatment Injured Persons
CM Revanth: కరాచీ బేకరీ ప్రమాదంపై దిగ్బ్రాంతి, మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
కరాచీ బేకరీ గోడౌన్లో జరిగిన ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
CM Revanth Reddy Asks Officials Provide Better Treatment Injured Persons
CM Revanth: గగన్ పహాడ్‌లో గల కరాచీ బేకరీ గోడౌన్లో పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. పేలుడు సమయంలో గోడౌన్లో 15 మంది ఉన్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం గురించి తెలిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందజేయాలని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు జారీచేశారు.
గాయపడ్డ వారిలో ఎక్కువ మంది ఉత్తరప్రదేశకు చెందిన వారు ఉన్నారు. గాయపడ్డ 8 మందిని కంచన్ బాగ్ డీఆర్డీవో ఆస్పత్రికి తరలించామని సీఎం రేవంత్‌కు (CM Revanth)అధికారులు వివరించారు. పేలుడు ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.