మంచిర్యాలలో సీఎం కేసీఆర్ (CM KCR) పర్యటన కొనసాగుతోంది. కాసేపటి క్రితం జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయనకు మంత్రులు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. మంచిర్యాల (Mancherial) జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(IDOC)ను ముఖ్యమంత్రి ప్రారంభించారు.. ఈ సందర్భంగా కలెక్టరేట్ శిలాఫలకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. నూతన కలెక్టరేట్(Collectorate)లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో సీఎం పాల్గొన్నారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనాన్ని కేసీఆర్ స్వీకరించారు. రూ.1,748 కోట్లతో చెన్నూర్, పర్ధాన్పల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు, రూ.510 కోట్లతో మెడికల్ కాలేజీ(Medical College), రూ.500 కోట్లతో మందమర్రి దగ్గర ఏర్పాటు చేయనున్నరు.