హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో గందరగోళం నెలకొంది. అంతర్జాతీయ మీడియా సంస్థ ప్రధాని మోదీపై విడుదల చేసిన వీడియో విషయంలో రెండు విద్యార్థి సంఘాల మధ్య వివాదం జరిగింది. భారత ప్రభుత్వం బ్యాన్ చేసిన వీడియోను ఫెటర్నేటి గ్రూప్ హెచ్సీయూలో క్యాంపస్ స్క్రీనింగ్ చేసింది. దీంతో ప్రధానికి వ్యతిరేకంగా ఉన్న ఈ డాక్యుమెంటరీపై విద్యార్థి సంఘాల్లో గొడవ జరిగింది. మోదికి వ్యతిరేకంగా ఉన్న వీడియోను స్క్రీనింగ్ చేస్తున్నారని ఫెటర్నేటి గ్రూప్ ను మరో వర్గం అడ్డుకుంది. ఇరు వర్గాల మధ్య బాహాబాహిగా ఘర్షణ జరిగింది. భారత ప్రభుత్వానికి, మోడీకి వ్యతిరేకంగా ఓ వర్గం నినాదాలు చేసింది. ఈ డాక్యుమెంటరీని ఇప్పటికే భారత ప్రభుత్వం నిషేధించింది. అయితే క్యాంపస్ లో ఈ వీడియోను ప్రదర్శించడంతో ఉద్రిక్తత నెలకొంది. క్యాంపస్ సెక్యురిటీ సిబ్బంది జోక్యంతో వివాదం సర్దుమనిగింది. ప్రస్తుతం ఇరు వర్గాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.