ADB: దండేపల్లి మండలంలోని నెల్కి వెంకటాపూర్, వంజరిగూడ, గూడెం గ్రామాలకు చెందిన ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించారు. ఈ మూడు గ్రామాల నుంచి సర్పంచ్, వార్డు స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని మండల అధికారులు తెలిపారు. నెల్కి వెంకటాపూర్ను జనరల్ గామార్చాలని, వంజరిగూడను వెంకటాపూర్లో కలపాలని, గూడెంలో ఎస్టీలు లేకున్నా రిజర్వ్ చేయడాన్ని నిరసిస్తూ ఎన్నికలను బహిష్కరించారు.