Cash Seized : తెలంగాణలో ఇప్పటి వరకు రూ.155 కోట్లు సీజ్‌

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీగా నగదు పట్టుబడుతూ ఉంది. ఇప్పటి వరకు రూ.155 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

  • Written By:
  • Updated On - April 24, 2024 / 01:30 PM IST

Cash Seized in Telangana : తెలంగాణలో లోక్‌ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడా పెద్ద ఎత్తున నగదును అధికారులు స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు. అలా ఇప్పటి వరకు రూ.155 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ వెల్లడించారు.

చదవండి :  ఢిల్లీ మద్యం కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ 14 రోజులు పొడిగింపు

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల నుంచి నగదు, బంగారం, గిఫ్టులు, మద్యం తదితరాలను స్వాధీనం చేసుకోగా ఆ మొత్తం రూ.155 కోట్ల విలువైనదని వికాస్‌రాజ్‌ తెలిపారు. పట్టపడిన మొత్తంలో రూ.61.11 కోట్ల నగదు ఉందని చెప్పారు. రూ.28.92 కోట్ల మద్యాన్ని సీజ్‌ చేశామన్నారు. రూ.23.87 కోట్ల విలువైన 27 క్వింటాళ్ల డ్రగ్స్‌ పట్టుబడ్డాయన్నారు. 19.16 లక్షల కోట్ల విలువైన బంగారం, వెండి, ఆభరణాలను, రూ.22.77 కోట్ల విలువైన ల్యాప్‌టాప్‌లు, కుక్కర్లను సీజ్‌ చేసినట్లు వెల్లడించారు. చెక్‌పోస్ట్‌ల దగ్గర ఎక్కడికక్కడ సోదాల్ని ముమ్మరం చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 35,356 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని వికాస్‌రాజ్‌ తెలిపారు.

చదవండి : వేసవి సెలవుల్లో పిల్లలతో ఈ విషయాల్లో జాగ్రత్త!

Related News

Telangana cabinet meeting: తెలంగాణ క్యాబినెట్ భేటీకి ఈసీ అనుమతి.

తెలంగాణ క్యాబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్‌ను ఏర్పాట్లు జరుగుతున్నాయి.