SDPT: ఇటీవల గురుపూజోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసలు అందుకున్న మర్కుక్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల అంగడి కిష్టాపూర్ జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. 60 మంది విద్యార్థుల తరగతి గదిని పరిశీలించి, పలకపై ఏబీసీడీలు రాయించి, వారి ప్రతిభను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.