KMM: కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల రద్దుకు వ్యతిరేకంగా బుదవారం మధిరలో సార్వత్రిక సమ్మె చేపట్టారు. స్వచ్ఛందంగా పలు కార్మిక యూనియన్ సంఘాల నాయకులు, కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కార్మికుల హక్కులను హరించడమే లక్ష్యంగా కేంద్రం కోడ్లను రూపొందించిందని కార్మిక సంఘాల ప్రతినిధులు ఆరోపించారు.