SRCL: వేములవాడలోని రాజరాజేశ్వరి దేవస్థానానికి అనుబంధమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి ఇవాళ భక్తులు పోటెత్తారు. రాత్రి 8 గంటల వరకు మొత్తం 99,689 మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. పవిత్ర సోమవారం, సమ్మక్క సారలమ్మ జాతర కారణంగా భక్తులు భారీగా తరలివచ్చినట్లు వెల్లడించారు. వారికి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసామని చెప్పారు.