»Bjp State Affairs In Charge Tarun Chugh Commented On Kcr Telanganas Wealth Is Being Looted Like Atm
Tarun chugh: దోచుకో దాచుకో కేసీఆర్ పాలసీ..ప్రతి దాంట్లో కమిషన్
విద్యార్థులు, ఉద్యమకారుల ఆత్మబలిదానాలపై ఏర్పిడిన తెలంగాణ ప్రస్తుతం కేసీఆర్ చేతిలో దోపిడికి గురైందని బీజేపీ రాష్ట్ర వ్యహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్(tarun chugh) వ్యాఖ్యానించారు. ప్రతి పనిలో కేసీర్ భారీగా కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. అంతేకాదు..
BJP state affairs in-charge Tarun Chugh commented on KCR, Telangana's wealth is being looted like ATM.
BJP: తెలంగాణ ముఖ్యమంత్రి(Telangana CM) ఆయన కుటుంబ సభ్యులు రాష్ట్ర సంపదను ఏటీఎంలా(ATM) దోచుకుంటున్నారని బీజేపీ(BJP) రాష్ట్ర వ్యహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్(Tarun Chug) కామెంట్ చేశారు. కేసీఆర్(KCR) అవినీతి పాలనకు రాష్ట్ర ప్రజలు విసుగెత్తిపోయారని, వచ్చే ఎన్నికల్లో బీజీపీ ప్రభుత్వం వస్తుందని తెలిపారు. మేడ్చల్ అర్బున్ జిల్లా పార్టీ కార్యకర్తలతో మీటింగ్లో పాల్గొన్న ఆయన కేసీఆర్ ప్రభుత్వం ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
దోచుకో.. దాచుకో అనేది కేసీఆర్ అవలంభిస్తున్న సరికొత్త నినాదమని, తమ కుటుంబం మొత్తం తెలంగాణను లూటీ చేసే పనుల్లో బిజీగా ఉన్నారని పేర్కొన్నారు. ఎందరో ఆత్మబలి దానాలతో ఏర్పడ్డ తెలంగాణలో అరాచకపు పాలన కొనసాగుతుందని, వీరుల స్పప్నాలు నెరవేరలేదని వెల్లడించారు. మిషన్ భగీరథ(Mission Bhageeratha), మిషన్ కాకతీయ మొదలు పెడితే ప్రతీ దాంట్లో విపరీతమైన కరెప్షన్ ఉందని తెలిపారు. ఈ అవినీతికి కల్వకుంట్ల కుటుంబం భారీ మూల్యం చెల్లించక తప్పదని పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ(BJP) గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని బూత్ స్థాయిలో పర్యటించాలని, మోడీ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అదే విధంగా ఈ దోపడి ప్రభుత్వం చేస్తున్న అక్రమాల గురించి ప్రతి మనిషి, ప్రతి ఇంటికి తిరిగి చెప్పాలని పిలుపునిచ్చారు. అలాగే ఈ 4 నెలలు పార్టీ కోసం పూర్తి సమయం కేటాయించాలని, బీఆర్ఎస్ను ఓడించి ఇంటికి సాగనంపుతామనే శపథం ప్రతి కార్యకర్త చేయాలన్నారు. కూకట్పల్లి సెగ్మెంట్ పరిధి కైత్లాపూర్లో బీజేపీ ఆఫీసును గురువారం సాయంత్రం బీజేపీ జాతీయ కార్యదర్శి తరుణ్ చుగ్ ప్రారంభించారు.