NRML: జిల్లా పోలీసుల పనితీరుకు సంబంధించిన వార్షిక నివేదికను సోమవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు కృషి చేయడం జరిగిందని తెలిపారు. బాసర త్రిబుల్ ఐటీలో సమస్యల పరిష్కారానికి యూనివర్సిటీని దత్తతకు తీసుకున్నట్లు పేర్కొన్నారు.