HYD: బండ్లగూడలోని మన్నత్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో ఘరానా చోరీ జరిగింది. ఓ దావత్ వేడుకలో వధూవరుల బంధువులమని నమ్మించిన గుర్తుతెలియని వ్యక్తులు, అదును చూసి రూ. 60,000 నగదు, మొబైల్ ఫోన్ ఉన్న పర్సును ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన బండ్లగూడ పోలీసులు, సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.