SRPT: కోదాడ, హుజూర్నగర్, సూర్యాపేట నియోజకవర్గాలకు చెందిన 12 మండలాల భవన నిర్మాణ కార్మికులు కోదాడ పట్టణంలో ఉన్న లేబర్ ఆఫీస్‌ను మంగళవారం ముట్టడించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ మాట్లాడుతూ… భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీములను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వాలనే జీవో నెంబర్ 12 ప్రభుత్వం వెంటనే సవరించాలన్నారు.