అన్నమయ్య: సుండుపల్లి మండలం పెద్దినేని కాల్వ పంచాయతీ బేరిపల్లిలో తాగునీటి సమస్య నెలకొంది. మంగళవారం మైనార్టీ నాయకులు, మహిళలు ఎంపీడీవో సుధాకర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. గత పది రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా పంచాయతీ మోటర్లు కాలిపోవడంతో తాగునీటి కొరత ఏర్పడిందని వారు తెలిపారు. ఎంపీడీవో సుధాకర్ రెడ్డి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.