ADB: హైదరాబాదులోని జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందడంతో శుక్రవారం నార్నూర్ గాంధీ చౌక్ వద్ద పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ మండల అధ్యక్షుడు దేవురావు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను చూసి ప్రజలు పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించారని పేర్కొన్నారు.