ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ శుక్రవారం మంత్రి వివేక్ వెంకటస్వామిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిశారు. జిల్లాలో సమస్యలతో పాటు అభివృద్ధి పనులపై మంత్రితో సుదీర్ఘంగా చర్చించారు. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు కేటాయించాలని మంత్రిని కోరారు.