సిద్దిపేట: అత్యాచారం, పెళ్లి చేసుకుంటానని ఓ ఉపాధ్యాయురాలిని మోసం చేసిన కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.1.50 లక్షల జరిమానా విధిస్తూ సిద్దిపేట అడిషనల్ జడ్జి జయ ప్రసాద్ తీర్పు ఇచ్చారని సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. బాధితురాలికి రూ.5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారని కమిషనర్ తెలిపారు.