MLG: తాడ్వాయి మండలంలో ఓ లారీ ప్రమాదవశాత్తు దగ్ధమైంది. మండలంలోని కొడిశెల లింగాల గ్రామాల మధ్య అడవిలో గురువారం రాత్రి కొబ్బరికాయల లోడుతో మేడారం వెళుతుండగా ప్రమాదవశాత్తు లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీకి మంటలు అంటుకొని దగ్ధమైనట్లు అటుగా వెళ్లిన ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.