»Amit Shah Said That Congress Does Not Have The Courage To Do Surgical Strikes
Amit Shah: సర్జికల్ స్ట్రయిక్స్ చేసే దమ్ము కాంగ్రెస్‌కు లేదు
కాంగ్రెస్‌కు సర్జికల్ స్ట్రయిక్ చేసే దమ్ము, ధైర్యం లేదని కేంద్ర మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశానికి కాంగ్రెస్ చేసింది ఏమి లేదని వెల్లడించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Amit Shah said that Congress does not have the courage to do surgical strikes
Amit Shah: కాంగ్రెస్‌కు సర్జికల్ స్ట్రయిక్ చేసే ధైర్యం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదులను పెంచిపోషించిందని తీవ్ర ఆరోపణలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో పర్యటించారు. వికారాబాద్‌లో బీజేపీ ప్రచారం సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా షా ప్రసంగిస్తూ.. శత్రువులతో యుద్ధం చేసే దమ్ము, సర్జికల్ స్ట్రయిక్స్ చేసే ధైర్యం కాంగ్రెస్ పార్టీకి లేదని వ్యాఖ్యానించారు. పుల్వామా దాడుల అనంతరం పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన విషయం గుర్తుచేశారు. ఆ ఆపరేషన్‌లో పాక్ ఉగ్రవాదులను హతమార్చినట్లు పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్జికల్ స్ట్రయిక్ గురించి తమాషాగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదులను కాపాడే పార్టీ అని ఆరోపించింది. పీఓకే భారత్‌లోనే ఉంటుందని, బీజేపీ ఉన్నంత ఆ ప్రాంతం పాకిస్థాన్ పాలు చేయమని అన్నారు. కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లోనే ఉంటుందని పేర్కొన్నారు. అలాగే తెలంగాణ భవిష్యత్తుకు బీజేపీ గ్యారెంటీ అని చెప్పారు. ఇక మళ్లీ రేవంత్ రెడ్డినే తన ఫేక్ వీడియోలను చేశారని ఆరోపించారు. తన వీడియోను మార్ఫింగ్ చేసి తప్పు చేశావు రేవంత్ అని అమిత్ షా పేర్కొన్నారు.